వచ్చే ఎన్నికల్లో 88 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: 2019లో 4 స్థానాలు గెలుచుకున్న బిజెపి ఈ సారి ఎన్నికల్లో మరో నాలుగు స్థానాలతో కలిపి మెుత్తం 8 చోట్ల విజయం సాధించింది. బీజేపీ విజయం పట్ల రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బీజేపీపై విశ్వాసం ఉంచిన రాష్ట్ర ప్రజలు అధిక స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించారని చెప్పారు. లోక్‌సభ ఫలితాలను బట్టి చూస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉండాలని ప్రజలే భావిస్తున్నారనే విషయం అర్థమవుతోందని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు ఉందని.. ప్రజలు కట్టబెట్టిన విజయంతో తమపై బాధ్యత మరింత పెరింగిదన్నారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలవబోయే స్థానాలపై స్పష్టతనిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8, లోక్ సభ ఎన్నికల్లో 8 స్థానాలను గెలిచామని రానున్న శాసనసభ ఎన్నికల్లో 88 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి అధికారంలోకి రాబోతున్నామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీపై ఎంత విష ప్రచారం చేసినా.. ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ కావటం వల్లే తమ పార్టీ గెలిచిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రేవంత్ చేసిన కామెంట్లు నిజమైతే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన అనేక సెట్మెంట్లలో కాంగ్రెస్‌కు మెజారిటీ ఎందుకు తగ్గిందో చెప్పాలన్నారు.

తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాల్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత లభించిందన్నారు. బీఆర్ఎస్ 14 చోట్ల మూడో స్థానానికే పరిమితమైందని.. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అయిన మెదక్‌లో ఆ పార్టీ వందల కోట్లు ఖర్చు చేసినా విజయం దక్కలేదన్నారు. సికింద్రాబాద్‌లో వాస్తవంగా కాంగ్రెస్ పోటీ చేయలేదని.. కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పోటీ చేసిందనన్నారు. బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించడంతో పాటు మరో 7 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిందని వెల్లడించారు

Leave A Reply

Your email address will not be published.