ఆపదలో ఉన్న వారికి ఆపత్బంధువు వెస్సో ట్రస్ట్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ వెస్సో ట్రస్ట్ ముందుకు వచ్చి దాతలనుంది విరాక్లాలు సేకరించి ఆర్దిక సాయయాన్ని అందించింది. తాజా గా  విజయవాడ నివాసి యెదురేశ్వరపు జగదీష్(32) ఒక చిరు ఉద్యోగి. వీరి భార్య ఏడు నెలల గర్భంలోనే 650 గ్రాముల బరువుతో (ప్రిమెచ్యూర్ బేబీ) మగ శిశువుకు జన్మ నిచ్చారు. బిడ్డ ఎదుగుదలకు ఒక కిలో బరువు వచ్చే వరకూ ఇంక్యూబేటర్ లో 45 రోజుల పాటు ఉంచాలని వైద్యుల సలహా. మొత్తం వైద్యానికి సుమారుగా 10 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. తన కంపెనీ ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షలు మరియు స్వయంగా 2 లక్షలు వైద్యం నిమిత్తం ఖర్చు చేశారు.  బంధు మిత్రులు కూడా కొంత ఆర్థిక సహాయం చేశారు. వెస్సో గురించి తెలుసుకొని, గౌరవ దాత నవిరి సాంబశివరావు ద్వారా ఒక లక్ష రూపాయిల ఆర్థిక సహాయం చేయమని వెస్సోను కోరారు.  వెస్సో గౌరవ దాతల సహకారంతో జగదీష్ కు ₹47400/- అందజేసింది. ఈ సందర్భంగా వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ తన బిడ్డను రక్షించు కొనటానికి తాపత్రయపడుతున్న ఒక తండ్రికి తగు ఆర్థిక సహాయం చేసి, ఆ శిశువును ఆదుకొన్న గౌరవ దాతలకు పేరు పేరునా ధన్యవాదములు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.