బీసీలకు కావలసింది ఒక లక్ష స్కీమ్ కాదు..వచ్చే ఎన్నికల్లో 50% శాతం రిజర్వేషన్లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీసీలకు కావలసింది ఒక లక్ష స్కీమ్ కాదని,వచ్చే అసంబ్లి ఎన్నికల్లో 50% శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీట్లు కేటాయించాలని జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ  అధ్యక్షులు తట్టే మహేష్ డిమాండ్ చెసారు.శుక్రవారం గద్వాల్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం లో మాట్లాడుతూ  టిఆర్ఎస్ పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలు వచ్చే అసంబ్లి ఎన్నికల్లో బిసి లకు 50% శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్య మంత్రి అబ్యార్తినిం ప్రకటించాలని డిమాండ్ చేసారు.  ఈ డిమాడ్ ను విస్మరిస్తే పార్టీలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. అత్యధిక జనాభా గల బీసీ జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అలాగే బీసీ స్టడీ సర్కిల్ కు 150 కోట్లు ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న బీసీ స్టడీ సర్కిల్ అమౌంట్ ఇవ్వాలని, రాష్ట్రంలో అన్ని జిల్లాల స్టడీ సర్కిల్ ఏర్పాటుచేసి విద్యార్థులకు ఉచిత వసతులు కల్పించాలని డిమాండ్ చేసారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ బీసీ వాదాన్ని వినిపించి 50% శాతం రిజర్వేషన్స్ విషయం  లో  కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మన హక్కు మన వాటా వచ్చేటట్టు చూడాలని విజ్ఞప్తి చేసారు.

Leave A Reply

Your email address will not be published.