కెసిఆర్ కు పట్టిన గతే జగన్ కు  పడుతుంది

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వని వారు ఓటమి పాలయ్యారు అని  వ్యాఖ్యలు చేసారు.కేసీఆర్ సీఎంగా ఉండగా కలిసేందుకు 80 సార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదన్నారు. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ చివరకు మాజీ సీఎం అయ్యారని గుర్తుచేశారు. ఒకవేళ జగన్ కూడా తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే కేసీఆర్ తరహాలోనే జగన్ మాజీ సీఎం అవుతారని కేఏ పాల్ జోస్యం చెప్పారు.ఏపీ సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాడేపల్లి వెళ్లారు. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు కేఏ పాల్‌కు తెలిపారు. అంతేకాకుండా క్యాంప్ కార్యాలయం నుంచి వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు. అంతకుముందు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోసం క్యాంప్ ఆఫీస్ వద్ద కేఏ పాల్ గంటకు పైగా వేచి చూశారు. సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో క్యాంప్ కార్యాలయం నుంచి నిరాశగా తిరిగి వెళ్లిపోయారు.కాగా ఎంతో మంది దేశాధినేతలు తాను అడగ్గానే అపాయింట్‌మెంట్ ఇచ్చారని కేఏ పాల్ అన్నారు. ప్రధాని మోదీహోంమంత్రి అమిత్ షా సైతం తనకు అడగ్గానే అపాయింట్‌మెంట్ ఇచ్చారని.. కానీ కేసీఆర్ సీఎంగా ఉండగా కలిసేందుకు 80 సార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదన్నారు. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ చివరకు మాజీ సీఎం అయ్యారని గుర్తుచేశారు. ఆయన మాజీ సీఎం అయ్యాకే తనకు అపాయింట్ మెంట్ ఇచ్చారన్నారు. ఒకవేళ జగన్ కూడా తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే కేసీఆర్ తరహాలోనే జగన్ మాజీ సీఎం అవుతారని కేఏ పాల్ జోస్యం చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని కొనియాడారు. అయితే జగన్ అపాయింట్ మెంట్ కోసం రెండు రోజుల పాటు విజయవాడలోనే ఉండి వేచి చూస్తానని స్పష్టం చేశారు. అపాయింట్మెంట్ ఇస్తే సీఎంతో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తానని.. రహస్యాలు చెబుతానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారో లేదా 75 సీట్లు గెలుస్తారో.. లేదా 25 సీట్లు మాత్రమే గెలుస్తారో తనకు తెలియదని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.