కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువులు ఏమయ్యాయి

.. ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఏ నియామకాల కోసం కొట్లాడి బలిదానాలు చేసి తెలంగాణ స్వరాష్ట్రాన్ని తెచ్చుకున్నాము అదే స్వతంత్ర తెలంగాణలో కొలువులు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుని తను చాలిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కిగౌడ్ అన్నారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయక తండాకు చెందిన నిరుద్యోగి ఏడుకొండలు ఆత్మహత్యకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఏడుకొండలు కుటుంబానికి ప్రభుత్వం రెండు పడకల ఇల్లు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా తక్షణం ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో నిరుద్యోగ భృతి 3016 ను వెంటనే రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడితే ఇంటి కుక్క ఉద్యోగం వస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం ఊరికి ఒక ఉద్యోగమైన ఇచ్చాడా అని ప్రశ్నించారు. లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకు నోటిఫికేషన్లపై ఎందుకు మాట్లాడడం లేదు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలపై వెంటనే ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయడంతో పాటు అన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.