10 సంవత్సరాల తెలంగాణ ప్రజలకి ఏం చేశారు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలకి ఏం చేశారు ఇప్పుడు తెలంగాణ వాదం గుర్తుకొచ్చిందా..అని టిపిసిసి ఉపాధ్యక్షురాలు నేరెళ్ల శారద ప్రశ్నించారు.సోమవారం గాంధి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ నెలరోజుల నుండి బిఆర్ఎస్ నేతల సంపాదన ఆగిపోయింది అందుకే ఈ విమర్శలు చేస్తున్నారన్నారు.ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మార్చి ప్రజల సమస్యలు తీరుస్తున్నాం..ఇరిగేషన్ పై కంగారు పడకండి మీకు ముందుంది ముసల పండుగ..మీ అవినీతిని అంతటినీ బయటకు తీస్తాం మన్నారు.మీరు ఎవరికైనా ఆసరా పెన్షన్లు ఇచ్చారా..మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడ ఇచ్చారో చెప్పాలి…హరితహారం పేరుతో కోట్ల రూపాయల దండుకున్నారన్నారు.అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారన్నారు.ఎప్పుడైనా పోలీస్ శాఖలో ఆత్మహత్యలు చూసామా ..ఈ పదేళ్లలో ఎంతమంది పోలీసుల ఆత్మహత్య చేసుకున్నారు తెలుసు కదా..మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ..బిఆర్ఎస్ నేతలు ఆటో డ్రైవర్లతో నిరసనలు చేయిస్తున్నారు..యువత గురించి మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా..ఒక్క ఎగ్జామ్ కూడా ప్రోపర్గా కండక్ట్ చేయలేకపోయారు..ఈ పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు..ప్రజలందరికీ 6 గ్యారంటీ స్కీములు అందుతాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.