కేసీఆర్ ప్రకటించాలనుకున్న ఆ జాతీయ పథకం ఏంటి..?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మరో వారం రోజుల్లో రైతులకు తీపి  కబురు… ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన పథకం రైతుల కోసం తీసుకొస్తాం.. అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొండాపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా అన్నారు. అయితే ఇప్పటికే దాదాపు వందల కొద్ది వారాలు గడుస్తున్నా.. కేసీఆర్ ఆ పథకం గురించి చెప్పడం లేదు. తమ కోసం కేసీఆర్ ఎలాంటి పథకం రెడీ చేశారోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం  ఆ విషయం గురించి పూర్తిగా మరిచిపోయాడని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇంతకు కేసీఆర్ ప్రకటించాలనుకున్న ఆ జాతీయ పథకం ఏంటి..?జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బోర్డులో ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని పెట్టారు. దీంతో బీఆర్ఎస్ మరోసారి రైతు ప్రభుత్వం రానుందన్న సంకేతాలు కేసీఆర్ ప్రజల్లోకి పంపారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుబంధు రైతు బీమా లాంటి పథకాలు ప్రవేశపెట్టి ఆకట్టుకున్నారు.అలాగే తెలంగాణ పొలాలు సుస్యశ్యామలం కావాలని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. అయితే ఆ తరువాత రైతులకు ఉచితంగా ఎరువులు విత్తనాలు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. కానీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు.అయితే బీఆర్ఎస్ ఏర్పాటు సందర్భంగా రైతులను ఆకట్టుకునేలా వినూత్న పథకం ప్రకటిస్తామని చెప్పారు. దీంతో మరోసారిరైతుల్లో ఆశలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో అధికార వర్గాల నుంచి వస్తున్నసమాచారం ప్రకారం  వృద్ధులకు వికలాంగులకు పింఛన్ మాదిరిగానే రైతులకు కూడా కిసాన్ పెన్షన్‘ అందించనున్నారని తెలుస్తోంది. ఈ హామీని దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మోడీ సర్కాకర్ పీఎం కిసాన్ యోజన పథకం కింద ఏడాదికి వేలు అందిస్తోంది. అయితే కేసీఆర్ నెలనెలా కొంత మొత్తాన్ని కేటాయించి అందించేందుకు సమాయత్తమవుతున్నారు.
దీనిని కచ్చితంగా దేశ రైతులు ఆదరిస్తారని ఈ హామీతో కేంద్రంలో అధికారంలోకి  రావడం ఖాయం అని తెలుస్తోంది. అయితే గతంలో కేసీఆర్ ప్రకటించిన కొన్ని పథకాలు హామీలుగానే మిగిలాయి. ఈ పథకం కూడా అలాగే ఉంటుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ కేసీఆర్ ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.