ఈ స్మశాన వాటికకు దారేది?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పరిపాలన సౌలభ్యం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు మండలాలను నూతనంగా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండలంలోని డోంగ్లి గ్రామాన్ని సైతం మండల కేంద్రంగా ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ డోంగ్లి యన్ బోరా గ్రామానికి ఓ సమస్య వచ్చి పడింది. ఇరు గ్రామాల మధ్య స్మశాన వాటికకు వెళ్లడానికి దారి లేకపోవడంతో స్థానికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని గురించి తెలియజేస్తూ సమస్యకు పరిష్కారం చూపాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ కు వినతి పత్రాన్ని సైతం అందజేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు గ్రామంలో ఎవరైనా చనిపోతే అంతిమయాత్ర పంట పొలాల నుండి ప్రమాదకరంగా వెళ్లవలసి వస్తుందని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో రైతులు సంవత్సరం మూడు పంటలు సాగు చేస్తుండడంతో పంట పొలాల మధ్యలో నుండి శవయాత్ర చేయవలసి వస్తుందని తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అంతిమయాత్ర కొరకు దారిని ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు జిల్లా స్థాయి అధికారులను కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.