కెసిఆర్ ఎక్కడ? కుర్చీ వేసాము.. శాలువ తెచ్చాము !

-      బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ ఎద్దేవా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పాత పగలు చల్లారలేదు. తనను జైల్లో పెట్టినందుకు కేసీఆర్ ను వదిలేది లేదంటూ బండి సంజయ్ కాస్త గట్టిగానే పంతం పట్టినట్టుగా తెలుస్తోంది. అందుకే మోడీ హైదరాబాద్ వచ్చిన వేళ కాక రేపు మాటలు మాట్లాడాడు. కేసీఆర్ ను సన్మానించడానికి కుర్చీ వేశాం ‘శాలువ’ తెచ్చానంటూ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.తనను అరెస్ట్ చేయించిన కోపం బండి సంజయ్ కు ఇంకా తగ్గలేదు. అందుకే ప్రధాని ముందే కేసీఆర్ కు గట్టి పంచ్ లు ఇస్తూ ప్రసంగించాడు. కేసీఆర్ పై సెటైర్లు వేశాడు. తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం వచ్చిన ప్రధాని మోడీ వాటిని ప్రారంభించేసి శంకుస్థాపనలన్నీ చేసేసిన తర్వాత హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభ ముగిసిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ్లి కేసీఆర్ షెడ్యూల్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్ కోసం ఎదురుచూశానని అన్న బండి సంజయ్.. కేసీఆర్ కు సన్నానం చేసేందుకు శాలువా కూడా తీసుకొచ్చనంటూ ఈ సందర్భంగా అదిరిపోయేలా సెటైర్ వేశారు. ప్రొటోకాల్ ప్రకారం కేసీఆర్ కోసం కుర్చీ కూడా వేశామన్నారు. దేశ ప్రధాని రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్ కు వస్తే కేసీఆర్ ఎందుకు రారు అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ ఆటంకం అని విమర్శించారు.తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం కావడానికి రైల్వే మంత్రి బీజేపీ నేతలంతా వస్తే కేసీఆర్ మాత్రం రాలేదంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రంపై ఆయనకు ప్రేమ లేదా? అంటూ ప్రశ్నించింది..ఇప్పుడు కేసీఆర్ రాకపోవడానికి ఆయనకు జ్వరం వచ్చిందా? లేక కోవిడ్ వచ్చిందని అంటారు కావచ్చని బండి సంజయ్ సెటైర్లు వేశారు. కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కారణం తెలంగాణ సమాజానికి చెప్పాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.