డెంగ్యూ వ్యాధిపై రాష్ట్రాన్ని హెచ్చరించిన డబ్ల్యూహెచ్ఓ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతోన్నాయి. దీనికి ప్రధాన కారణం డెంగ్యూ దోమలు. అంతకు ముందు చెత్త కుప్పల్లో, మురికి కాలువల్లో వృద్ధి చెందే ఈ దోమలు ఇంట్లో కూడా పెరుగుతోన్నాయి. వర్షకాలం వర్షపు నీరు నిలిచిపోయి డెంగ్యూ దోమలు పెరుగుతోన్నాయి. ముఖ్యంగా ఇళ్లలో వీటి వృద్ధి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందుకే ఎండకాలం కూలర్ వాడిన తర్వాత అందులో వాటర్ తీసివేయాలి. లేకుంటే అందులో దోమలు వృద్ధి చెందుతాయి. అలాగే కొబ్బరి బొండాలను ఇంటి బయట పడేస్తారు. అందులో నీరు చేరి దోమలు తయారవుతాయి.

అలాగే ఇంటిపై టైర్లు, డబ్బలు పడేస్తుంటారు. వాటిలో కూడా నీరు చేరి దోమలు వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. చాలా నిర్లక్ష్యంగా ఉండడంతో డెంగ్యూ దోమలు వృద్ధి చెంది డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ఆస్పత్రులు డెంగ్యూ కేసులపై రిపోర్ట్ ను ఆలస్యంచేస్తుండడం వల్ల వ్యాధి ఎక్కువవుతుందని సూచించింది

Leave A Reply

Your email address will not be published.