నిజాం వారసులకు దక్కిన గౌరవం దళిత MLA సాయన్నకు ఎందుకు దక్కలేదు

- కొప్పుభాష

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న గారి అంత్యక్రియలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపక పోవటటాన్ని భారతీయ జనతా పార్టీ యస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొప్పుభాష గారు తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా భాషా మాట్లాడుతూ..

1994వ సంవత్సరం నుండి మూడు దశాబ్దాల వరకు ఐదు సార్లు కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి తుది శ్వాస వరకు ప్రజాసేవకు తపించిన ఆజాతశత్రువు సాయన్న అన్నారు కంటోన్మెంట్ ప్రజల బంధువుగా తిరుగులేని దళిత నాయకునిగా ఉమ్మడి రాష్ట్రంలోనే కాక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని తనువుచాలించిన సాయన్న గారి లోటు తీర్చలేనిదన్నారు. అయితే మంత్రి తలసాని ద్వారా ప్రభుత్వలాంఛనాలతో అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించి ఏర్పాట్లు ఉద్దేశ్యపూర్వకంగా మర్చిపోయిన వైఖరి శోచనీయం అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR.. సాయన్న గారి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించకపోవటం చరిత్రలో వివక్షకు సాక్షాలుగా మిగులుతున్నాయని అన్నారు. ఎంతో మంది సినీ నటులు మరెంతో మంది రాజకీయ నేతల అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి KCR అధికారికంగా నిర్వహించారని.,మొన్నటికి మొన్న నటుడు కృష్ణ గారి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించిన సందర్భాన్ని బీజేపీ స్వాగతిస్తుందని కానీ.. మూడు దశాబ్దాలుగా ప్రజాసేవలో నిమగ్నమై, కంటోన్మెంట్ ప్రజలే కాక రాష్ట్రంలోని ఎంతోమంది మన్ననలు పొందిన దళిత నేత సాయన్న గారి అంత్యక్రియలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా నిర్వహించకుండ తాను పొందిన రాక్షస ఆనందం దొరతననికి తార్కాణమే అన్నారు.

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ముకరంజా బహదూర్ టర్కీలోని ఇస్తాంబుల్ లో చనిపోతే ప్రత్యేక విమానంలో వారి శవాన్ని తెచ్చి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిన రీతిలో తెలంగాణ ముద్దు బిడ్డ సాయన్న అంత్యక్రియలు జరుపకపోవటం వెనక ఆంతర్యం ఏంటో చెప్పాలన్నారు. పవిత్ర భారత రాజ్యాంగం పై ఏ మాత్రం గౌరవం లేని కెసిఆర్ ఒకవేళ తాను రాసుకున్న రాజ్యాంగంలో దళితులను, దళిత నాయకత్వాన్ని, దళిత ప్రజాప్రతినిధులను వివక్షతో అణిచివేయాలనే నిబంధనలు ఏమైనా ఉంటే తెలంగాణ సమాజానికి తెలియపరచేయాలని డిమాండ్ చేశారు. ఏదేమైనా ప్రత్యేక రాష్ట్ర చరిత్రలో దళితుల ఆత్మగౌరవాన్ని సవాల్ చేస్తున్న KCR వైఖరికి ఘాటుగానే ఎదుర్కొంటామని “మాజీ CM” గా బిరుదు ఇచ్చి లాంఛనంగా సత్కరిస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.