సబ్సిడీ ఎరువులు కొనుగోలకు రైతుల కులమెందుకు?

-  కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ తీరును ఖండించిన అన్బుమణి రాందాస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సబ్సిడీ ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు రైతులు తమ కులాన్ని చెప్పాలన్న కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ తీరును పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్ ఖండించారు. ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అన్బుమణి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ‘వ్యవసాయం కులం ఆధారంగా చేయరు. ఎరువుల సబ్సిడీ కూడా కులప్రాతిపదికన ఇవ్వడం లేదు. అలాంటప్పుడు ఎరువుల సబ్సిడీ కోసం కులం పేరును నమోదు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. కేంద్రప్రభుత్వ తీరు రైతులను దెబ్బతీసేలా వుంది. కులసంఘాలను సంప్రదించి ఎరువుల సబ్సిడీ ఇవ్వాలని కేందం యోచిస్తోందన్న అనుమానం రైతుల్లో నెలకొని వుంది. అందువల్ల తక్షణం రైతుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే’ అని అన్బుమణి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.