ముదిరాజులంటే ముఖ్య మంత్రికి అంత చులకన ఎందుకు ?

-పగిడ్యాల సుదాకర్ ముదిరాజ్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి,

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో విద్యావంతుల శాతం పెరిగిన తరువాత ఓట్లు హరిజన, గిరిజన, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాకులు, రెడ్లు, రావులుగా చీలినాయి. హరిజనుల్లో మాల, మాదిగలుగా గిరిజనులలో 2, 3 కులాలుగా ఓట్లు “చీలుతున్నాయి బి.సి.ల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో గల ముదిరాజు, పద్మశాలి, గౌడ, యాదవులుగా ఓట్లు చీలి ఎవరికి వారుగా ఏకమౌతున్నారు. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో మరీ కులాలుగా ఓట్లు విడిపోతున్నాయి. పాలిస్తున్న పార్టీ. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కులాల వారిగానే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం. చేస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న భారాస పార్టీ మైనార్టీలను ఆకర్షించేందుకు వారి రిజర్వేషన్లను 10% కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించింది. అదే విధంగా గిరిజనుల విషయంలోనూ రిజర్వేషన్లు 10% పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇదీ కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఒక అడుగు ముందుకు వేసి ముస్లింల వక్ బోర్డుకు జ్యుడీషయల్ అధికారాన్ని ఇస్తామని ముఖ్యమంత్రిగారే స్వయంగా ప్రకటిస్తున్నారు. వీటన్నింటినీ జాగ్రత్తగా గమనించినప్పుడు భారాస ఓట్ల వేటలో ఎంత వరకైనా ప్రయాణం చేసే ప్రయత్నంలో ఉంది అనేది స్పష్టం.

మాల, మాదిగలకంటే, గిరిజనుల కంటే, మైనార్టీలకంటే, ఒకే కులంగా ముదిరాజులు (తెనుగు, రాసి బంటు తెలంగాణలో అధికసంఖ్యాకులు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఓట కోసం రాయితీలు కులాలకంటే, ఉద్యోగాల్లో ఉపాధిలో, వ్యాపారాల్లో, ఉన్నత చదువుల్లో ముదిరాజులు వెనుకబడి ప్రకటిస్తున్నా ఉండవచ్చు. సాంఘికంగా, రాజకీయంగా సహజంగానే వెనుకబడి ఉంటారు. ఆయా సామాజిక సమస్యలతో దెబ్బ మీద దెబ్బ తగిలిన కొద్ది సంఘటితమవుతున్నారు. ముదిరాజులు. ప్రత్యేకించి ఈ మధ్య తగులుతోన్న రాజకీయ దెబ్బలు విద్యావంతులను, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ముదిరాజు బిడ్డను ఆలోచింప చేస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రాష్ట్రంలోని అన్నీ వర్గాల, అన్నీ రకాల సమస్యలకు పరిష్కారం అనుకున్నాము. కానీ అందరినీ రెచ్చగొట్టి కొన్ని వర్గాలే బాగుపడతాయనేది అనుభవ పూర్వకంగా ఆశించిన వర్గాలకు అర్ధమౌతోంది. ప్రత్యేకించి ముదిరాజ సమాజానికి గుండెలో గుణపం దించినట్లు తీవ్ర బాధతో అర్థమౌతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెగించి కొట్లాడిన తెనుగోళ్లకు. మిగిలింది కన్నీటి కథలే!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సంపూర్ణంగా  అంకిత భావంతో ఉద్యమించి అసువులు బాసిన ముదిరాజ బిడ్డలెందరో. ప్రత్యేకించి ఉద్యమించిన మహా నాయకుడు ఈటెల రాజేందర్ అని తెలంగాణ స్పృహలోని ప్రతి – వ్యక్తికి తెలుసు. తెలంగాణ సాధన తరువాత వారికి లభించినది సముచిత స్థానమే కావచ్చు. కానీ ప్రభుత్వం నుండి వారిని తొలగించిన తీరు తెలంగాణ కన్నీటి చరిత్రలో శిలాఫలకమైన మైళ్లరాయి. అసలు ఈటెలను ఎందుకు తొలగించారు? తెలంగాణ రాష్ట్రంలో తొలి ఆర్థిక మంత్రిగా వారు అందించిన సేవలు అమూల్యమైనవి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా మనిషిని మనిషే తాకని సంక్లిష్ట స్థితిలో ఆరోగ్య శాఖను ప్రజా అవసరాలకు ‘ ఉన్న మరెవరికీ దరిదాపులో లేదు. మరెందుకు? .

మరెందుకు వారిని మంత్రి మండలి నుండి, పార్టీ నుండి తొలగించారు? కేవలం ముఖ్యమంత్రి గారి కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికే అయితే ఆ మేరకు వీరికున్న ప్రజామోదమెంత? హుజూరాబాద్ ఎన్నికలలో ప్రజలు సుస్పష్టమైన తీర్పును ఇచ్చారు మీ వ్యవహారాన్ని సవరించుకోమని, లేకపోతే ఈటెల కేవలం ఒక ప్రజల మనిషిగా మిమ్మల్ని, మీ ప్రజాదరణను, ప్రభుత్వ యంత్రాంగాన్ని మీ మంత్రి మండలి, మంది, మనీ మార్చటాన్ని తిరస్కరించి ఈటెలకు జై కొట్టిన తీ భారతీయ ప్రజాతంత్ర ఎన్నికల చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించదగిన ఘట్టం. ముఖ్యమంత్రి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం, పుత్రవాత్యలం కోసం ఈటెలను తొలగించి తెలంగాణ రాష్ట్రంలో భారాసకు పడే ఓట్లలో 10% వదులుకున్నారు. భారాసలో ఉన్న ముదిరాజ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తల్లో, నాయకుల్లో సగానికి సగం ఈబెల వెంటే భారాసను వదులుకున్నారు. ఈ నష్టాన్ని భారాస అధినేత ఏవిధంగా పూడ్చుకుంటారు? ఎప్పుడు పూడ్చుకుంటారు?? కాలం ఎంతో దూరం. లేదు.

ఒక సుసంపన్న వాణిజ్య వేత్తరు రాజ్యసభ సీటు అమ్ముకోవడానికి రాష్ట్రంలోని 12% ఓట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు, రాజకీయ సొమ్మలు డా॥ బండా ప్రకాష్ ముదిరాజ్ గారి చేత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించారని జనం కోడై కూస్తున్నారు. అయితే రాష్ట్రంలో అతిపెద్ద బిసి సామాజిక వర్గం అయిన ముదిరాజులకు మంత్రి మండలిలో స్థానం కల్పించేందుకు ఎంపి స్థానం వదిలించి ఎమ్మెల్సీగా చేశారని ముదిరాజ సామాజిక వర్గం అనుకుంది. నెలల కొద్ది ఎదురుచూపుల్లో వుంచి ఎలగబెట్టింది శాసన మండలి ఉపాధ్యక్ష పదవా? ఈ పదవిలో ఉంటూ 50 లక్షల మంది ముదిరాజుల ఆకాంక్షలను కనీసం వినగలరా? ఒకవేళ విన్నా ఏ విధంగా వారి అవసరాలను తీర్చగలరు? వారి అవసరాలను ఆదుకోకుండా. భారాసలో వారిని అంటిపెట్టి ఉంచగలరా? పాలక వర్గానికి పనికిరాని సామాజిక వర్గంగా ముదిరాజుల సామాజిక వర్గాన్ని భావించి ఉంటే… కేసీఆర్ గారు అధికారాన్ని మరోసారి సాధించుకోవడం సాధారణమే అని అనుకుంటే! ఎవరూ ఏం చేయలేరు. కానీ తప్పక మరోసారి ప్రజామోదాన్ని పొందాలంటే 12% ముదిరాజు.. సామాజిక వర్గం యొక్క మెప్పు కూడా అవసరమని తప్పక భావించాలి విజ్ఞులైన రాజకీయ పండితులు. తెలంగాణ రాష్ట్రంలో 0.5% నుండి 5% ఓట్లు కలిగి ఉన్న సామాజిక వర్గాలకు 65% పై బడిన ప్రాతినిధ్యం నేటి ప్రభుత్వంలో ఉన్నది. అందులో ఎన్నికైన వారు రావచ్చు. నామినేషన్ ద్వారా పదవి పొందినవారు కావచ్చు. వారే పాలక పార్టీ వారు అనుకొని సరిపెట్టుకోవడం రాజకీయ ఆరోగ్యప్రదం కాకపోవచ్చు. ఇది ఏ కోణంలోనైన సామాజిక న్యాయ విరుద్ధం. రాజకీయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న మన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు గారు సామాజిక న్యాయసూత్రాలకు దూరంగా నివసిస్తున్నారు. ఎందుకంటే.. జనాలకు దూరంగా జనాభేద్యమైన ఆ (అ) ప్రగతి భవన్లో ఉంటున్నారు. లేదా జనావాసాలకు దూరంగా ఆ ఫామ్ హౌజ్లో మిత్రులకు, శత్రువులకు, శ్రేయోభిలాషులకు జనం గోడు వినిపించనంత దూరాన, మనం విన్నా, వినకున్న సత్యం తన స్థానం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.

సంయుక్తం రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆంధ్ర ప్రాంత తెలుగు సోదరులు వారి భాష, హుషారుతో తెలంగాణ వారిని అనాగరికులే అనుకున్నారు. వారి భాషా, హుషారు తెలిసిన తరువాత తెలంగాణ వారు. సంయుక్త రాష్ట్రంలో తమకేదో జరిగిందని భావించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తిరుగుబాటు ప్రారంభించారు. తెలంగాణ వారు. చాలా సమయం పట్టింది. కాని విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమసమస్యలన్నీ తీరుతాయని తెగించి ప్రాణాలొడ్డి పోరాడిన తెనుగోళ్ళు తమ సమస్యలు ఈ ప్రత్యేక రాష్ట్రంలో తీర్చుకోలేకపోతున్నామని ఆలోచనలో పడ్డారు చెప్పుకోగలిగిన జన సంఖ్యలో గల మేము చెప్పుకునే దిక్కులేని ప్రాతినిధ్య శూన్యంగా ఉన్నామని ఆందోళన చెందుతున్నారు. సంయుక్త రాష్ట్రం 1970లో అనంతరామన్ కమీషన్ ద్వారా జరిగిన అన్యాయానికి 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో గల ప్రభుత్వం న్యాయం చేసింది. దురదృష్టవశాత్తు ఆ వెంటనే కోర్టు పరిధిలోకి వెళ్లింది. గౌరవ హైకోర్టును దాటి గౌరవ సుప్రీంకోర్టుకు చేరింది. గౌరవ అత్యున్నత న్యాయ స్థానం ముదిరాజుల జీవన స్థితిగతులపై ఓ రిపోర్టు పంపమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 8 సం||లు గడిచినా ప్రత్యేక రాష్ట్ర ప్రత్యేక ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో అత్యధికంగా 12% జనాభా కలిగి అత్యధిక కనీస జీవన స్థాయిలో జీవిస్తున్న ముదిరాజు సామాజిక వర్గ సమస్యను సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చే తీరిక లేకుండా పోయింది. చివరికి అత్యున్నత న్యాయ స్థానం ఈ సమస్యను రాష్ట్రంలో మీరే పరిష్కరించుకొమ్మని రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపింది. నెలలు గడుస్తున్నాయి. పాలక ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమౌతోంది. ముదిరాజు సమాజ ఓట్లు ఈ పాలించే పార్టీకి అవసరం లేదా? మైనార్టీల సమస్యలు అడిగినా, అడగకున్నా. గిరిజనుల సమస్యలు ఉరుకు పురుగున పూర్చి చేస్తున్నారు. ప్రభుత్వానికి ఇంత పెద్ద సామాజిక వర్గ ఓట్లు అవసరం లేదు అనుకుంటే చాలా పెద్దమూల్యం చెల్లించుకోవలసి రావచ్చు.

ఈటెల విషయంలో ఈ సామాజిక వర్గం రాజకీయంగా స్పందించలేదు. డా||బండ ప్రకాష్ విషయంలోనూ చలీచప్పుడు చేయలేదు. గౌరవ సుప్రీంకోర్టుకు 8 సం॥లు రిపోర్టు పంపకుండా మిన్నకున్నా ఈ ముదిరాజ సామాజిక వర్గం స్పందించలేదు. ఈ సామాజిక వర్గం అసంఘటితమైనది. వీరికి కేవలం ఓట్ల సమయంలో ప్రలోభపెడితే సరిపోతుంది. అనుకుంటే… కెసిఆర్ గారు 9 సం॥ల పాలనను చాలు అని అనుకోవలసి వస్తది. శరవేగంతో సంఘటితమవుతున్న ఈ ముదిరాజు సమాఖ్యం వేగంగానే తమ ఓట్లను సద్వినియోగం చేసుకునే దిశలో పయనిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.