ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ప్రజలు ఎందుకు నమ్మాలి?

- తండ్రి తాగితేనే తల్లికి అమ్మఒడి ఇస్తున్నందుకా?.. - మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకా?.. - మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ప్రజలు ఎందుకు నమ్మాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘‘నాలుగేళ్లలో 7సార్లు విద్యుత్ ఛార్జీలు  పెంచి రూ. 20 వేల కోట్ల భారం మోపినందుకు నమ్మాలా?.. మద్యపాననిషేదం అనిచెప్పిమద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకా?.. తండ్రి తాగితేనే తల్లికి అమ్మఒడి ఇస్తున్నందుకా?.. మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్‌ని పిచ్చివాడిని చేసిచంపినందుకా?.. తన అవినీతిని ప్రశ్నించిన దళితయువకుల్ని బలితీసుకున్నందుకా?.. మహిళల మానప్రాణాలతో ఆడుకుంటూవారి జీవితాలు నాశనంచేస్తున్నందుకా?.. ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేకజనంలోకి రావడానికి ముఖం చెల్లనందుకు జగన్‌ను నమ్మాలా?’’ అని ప్రశ్నించారు.జగన్ బొమ్మతో కూడిన స్టిక్కర్ల ను ప్రభుత్వ అధికారులువాలంటీర్లు ఇళ్లగోడలపై అంటించడం చట్టవిరుద్ధంకాదాఅని అనిత ప్రశ్నించారు. ఏపీ ప్రివెన్షన్ యాక్ట్ 1997 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయపార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడంప్రజల అనుమతి లేకుండా వారిఇళ్లపై ప్రకటనలు. బొమ్మలు అంటించడం చేయకూడదని తెలియదాఅని నిలదీశారు. టీడీపీ మహిళానేత కల్యాణి అరెస్టులో హద్దులు మీరి ప్రవర్తించిన పోలీసులపై జాతీయ మహిళా కమిషన్‌ కు ఫిర్యాదుచేస్తామన్నారు. మంత్రి రోజా ఇచ్చిన సవాల్‌ను తానుస్వీకరిస్తున్నానన్నారు. ఆమె ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని స్పష్టం చేశారు. పరదాలుపోలీసులుప్రైవేట్ సెక్యూరిటీ లేకుండా జనంలోకి వచ్చే దమ్ముధైర్యం జగన్‌కురోజాకు ఉన్నాయాఅంటూ వంగలపూడి అనిత సవాల్ విసిరారు.

Leave A Reply

Your email address will not be published.