దళిత ప్రధాని కార్డు ప్రయోగం ఫలించేనా!?

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: గత డాది కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఎం.మల్లికార్జున్‌ ఖర్గే ఎన్నికయ్యారు. 24 ఏండ్ల తర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబానికి సంబంధం లేని బయటి వ్యక్తికి ఈ పదవి లభించిందని కొందరు సంబురపడ్డారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ తర్వాత 52 ఏండ్లకు మరోసారి దళిత వ్యక్తిని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టిన కాంగ్రెస్‌ తాజాగా ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును జపిస్తున్నది. ఎన్నికల వేళ ‘దళిత ప్రధాని’ కార్డును కాంగ్రెస్‌ తెరపైకి తీసుకురావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.1998 నుంచి 2022 వరకు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధినేతలుగా ఉన్నా రు. కానీ వరుస వైఫల్యాలతో అనూహ్యంగా ఖర్గేను కాంగ్రె స్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసింది. తాజాగా ఆ పార్టీ దళిత ప్రధాని కార్డును ప్రయోగిస్తున్నట్టు తెలుస్తున్నది.సోనియా, రాహుల్‌గాంధీ నాయకత్వంలో వరుసగా రెండు పార్లమెంటు ఎన్నికల్లో (2014, 2019) కాంగ్రెస్‌ ఘోర పరాజయాలను చవిచూసింది. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందాలంటే కనీసం 55 స్థానాలు అవసరం. ఈ రెండుసార్లూ కాంగ్రెస్‌ కేవలం 44, 52 సీట్లతో సరిపెట్టుకున్నది. గత పదేండ్లుగా భారత పార్లమెంటు దిగువ సభలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కకపోవడం ఆ పార్టీ కేంద్ర నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనం. దేశ చరిత్రలో కాంగ్రెస్‌ పదేండ్లు అధికారంలో లేకపోవడం ఇదే మొదటిసారి.

Leave A Reply

Your email address will not be published.