2027లో ప్రపంచం అంతమవుతుందా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దశాబ్దం క్రితం.. 2012లో ప్రపంచం అంతమవుతుందనే వార్తలు కల్లోలాన్ని రేపిన విషయం తెలిసిందే..! మయాంగ్ క్యాలెండర్ 2012తో ముగియడంతో.. అప్పట్లో ప్రపంచ ప్రజలు దాన్ని విశ్వసించి, భయాందోళనలకు గురయ్యారు. 2012లో మహాప్రళయం వస్తుందంటూ సైన్స్‌ఫిక్షన్ సినిమా ‘2012’ కూడా బాక్సాఫీస్‌ను బద్ధలుకొట్టింది. ఇప్పుడు అలాంటి సమాచారమే నెట్టింట వైరల్ అవుతోంది. మరో ఐదేళ్లలో.. అంటే 2027లో భూమిపై మానవాళి ఉండదనే కల్లోలం ఇప్పుడు వెబ్‌లో రేగుతోంది. 2027లో భూమిపై మానవాళి అనేదే కనిపించలేదని టైమ్ ట్రావెలర్గా చెప్పుకొంటున్న మారియా, జెవియర్ల జంట చెప్పడం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది.

ఎవరీ మారియాఏం ఆధారాలు చూపారు??

మారియాజెవియర్ఒక టిక్‌టాక్ యూజర్లు. టిక్‌టాకర్ జెవియర్ అనే హ్యాండిల్ నేమ్‌తో వీడియోలను షేర్ చేస్తుంటారు. వీరిద్దరూ తమను తాను టైమ్ ట్రావెలర్‌గా క్లెయిమ్ చేసుకుంటున్నారు. 2027లో తాను తీసిన ఓ వీడియో ఫుటేజీని వారు షేర్ చేశారు. ఇదే తమ క్లెయిమ్‌కు ఆధారమని బల్లగుద్ది చెబుతున్నారు. ‘‘మేమిద్దరమే బతికి ఉన్నాము. వీడియోలో చూడండి..! భవనాలన్నీ పాడుబడ్డాయి. వాహనాలు ఎక్కడికక్కడే రోడ్లపై అడ్డదిడ్డంగా నిలిచిపోయాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ప్రాంతం స్పెయిన్‌లోనిది’’ అని మారియా వివరించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మహా ప్రళయం గురించి మరోమారు చర్చ మొదలైంది.

మారియా, జెవియర్లు వీడియోను చిత్రీకరించిన తేదీని 2027 ఫిబ్రవరి 13గా పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సరిగ్గా అదే రోజున వారు ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘కేవలం ఐదేళ్లలో భూమిపై మానవాళి ఉనికి పరిసమాప్తమవుతుంది’’ అని వారు పేర్కొన్నారు. తాము ఏం జరిగిందో తెలుసుకునేందుకు సమీపంలోని ఆస్పత్రుల్లో పరిశీలించామని, అక్కడంతా నిర్మానుష్యంగా ఉందని వివరించారు. ‘‘దక్షిణ అమెరికాలోని ఓ గ్రామంలో ఓ గ్రహాంతర వాసి మృత కళేబరాన్నిచూశాం. కొద్దిసేపటికే.. అది మాయమైపోయింది’’ అని వారు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.