సీఎం జగన్ చొరవతో బీసీల ప్రైవేట్ బిల్లుతో అన్ని పార్టీల్లో బీసీలవాదం

- విజయసాయి రెడ్డికి అభినందనలు తెలిపిన కర్రి వేణుమాధవ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జరుగుతున్న ఢిల్లీ జంతర్ మంతర్ ప్రోగ్రాం మరియు పార్లమెంట్లో వివిధ పార్టీల నాయకుల్ని కలుస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి  విజయసాయి రెడ్డి గారిని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు యాదవ్ తో కలిసి గత మూడు సంవత్సరాల క్రితం రాజ్యసభలో ప్రైవేటు బిల్లుగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ విషయంపై మాట్లాడి బీసీలు మనసు గెలుచుకున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రి వేణుమాధవ్ అన్నారు.ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలు దళపతి అయినటువంటి 50 సంవత్సరాలు ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ కేటాయించడం తదుపరి దేశంలోని ప్రధాన ప్రతిపక్ష అయిన కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడు రాహుల్ గాంధీ సైతం బీసీ జనగణన పై మాట్లాడటం బీసీ ఉద్యమానికి మరింత ఊపునిచ్చిందని అన్నారు. ఈరోజు వివిధ పార్టీల నాయకులను కలిసి పార్లమెంట్లో బీసీల డిమాండ్లు అయిన చట్టసభల్లో రిజర్వేషన్లు ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ జన గణనలో కుల గణన బీసీ ఉద్యోగుల ప్రమోషన్ల రిజర్వేషన్లు పలు విషయాలపై చర్చించారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య  సైతం అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులను సమన్వయం చేసి ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించి చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు కేటాయించే విధంగా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్టుగా కర్రి వేణుమాధవ్ తెలియజేశారు.ఈ కార్యక్రమం లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం,తెలంగాణా రాష్ట్ర కన్వినర్ లాల్ కృష్ణ, బిసి విద్యార్ధి సంఘం తెలంగాణా అద్యక్షులు అంజి, బిసి ఇక్యవేదిక అద్యక్షులు అనంతయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటుపల్లి సురేష్ మరియు తెలంగాణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ జలపల్లి కిరణ్, వంశీ తెలంగాణ సర్పంచుల సంఘం అధ్యక్షుడు, భూమన యాదవ్ పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.