బీఆర్ అంబేద్క‌ర్ లేక‌పోతే తెలంగాణ లేదు

- మంత్రి కేటీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పంజాగుట్ట కూడ‌లిలో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు కొప్పుల ఈశ్వ‌ర్, మ‌హ‌ముద్ అలీ, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో పాటు ప‌లువురు కార్పొరేట‌ర్లు, నాయ‌కులు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ అంబేద్క‌ర్ లేక‌పోతే తెలంగాణ లేద‌న్నారు. అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంద‌న్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌మ్మున్న నేత‌. కేసీఆర్ అమ‌లు చేస్తున్న ద‌ళిత‌బంధు.. సాహ‌సోపేత‌మైన ప‌థ‌కం అని పేర్కొన్నారు. సెక్ర‌టేరియ‌ట్‌కు అంబేద్క‌ర్ పేరు పెట్ట‌డం కేసీఆర్‌కే సాధ్య‌మైంద‌న్నారు. కొత్త పార్ల‌మెంట్‌కు కూడా అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని డిమాండ్ చేశారు. పంజాగుట్ట కూడ‌లికి అంబేద్క‌ర్ పేరు పెడుతామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your email address will not be published.