విద్య,ఉద్యోగ, వాణిజ్య, సామాజికి రంగాల్లో మహిళలు ముందుకు రావాలి

జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బిసి సంక్షేమ సంఘం తెలంగాణా రాష్ట్ర మహిళా ప్రదాన కార్యదర్శిగా ఈద సుజాత నియమితులైనారు. ఈ మేరకు బిసి భవన్ లో జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య నియామక పత్రాన్ని అందజేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం కు చందిన ఈద సుజాత గత 20 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ గుర్తింపు పొందారు.సారుద్యమలో పాల్గొనడమే కాకుండా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మద్య నిషేద కమిటిలో పనిచేసి రాష్ట్రంలో మద్యపానం వాళ్ళ కలిగే అనర్దాలు, కలిగే నష్టాలను ప్రజలకు వివరించడం లో గుర్తిపు పొందారు.సుజాత చేసిన సేవాకార్యక్రమాలను గుర్తించిన ఆర్.కృష్ణయ్య ఆమెకు బిసి సంక్షేమ సంఘం తెలంగాణా రాష్ట్ర మహిళా ప్రదాన కార్యదర్శిగానియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ మహిళలు వంటింటి కుందేళ్ళు కారని విద్య,ఉద్యోగ, వాణిజ్య, సామాజికి రంగాల్లో మగవారితో సమానంగా ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.అణగారిన బిసి వర్గాల అభివృద్ధికోసం, వారి హక్కుల పరిరక్షణ  కోసం పనిచేయాలని అన్నారు. అనంతరం సుజాత మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వ మహిలబిల్లుకు ఆమోదం తిలుపడం అభినందనీయమని, కాని మహిలాబిల్లులో బిసి మహిళలకు జనాబా ప్రాదిపదికన 50 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని డిమాండ్ చేసారు. ఇందుకోసం తనవంతు పోరాటం చేస్తానని తెలిపారు.తనపై గల నమ్మకం తో తనకు బిసి సంక్షేమ సంఘం తెలంగాణా రాష్ట్ర మహిళా ప్రదాన కార్యదర్శిగా నియమించిన ఆర్.కృష్ణయ్య కు కృతఙ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.