మహిళా సాధికారత ఆర్థిక స్వావలంబన తో ప్రగతి సాధ్యం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మోడలింగ్, మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్ రంగాలలో నిపుణత సాధించి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో అవకాశం ఉందని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు.కృషి, పట్టుదల, లక్ష్యం దిశగా ఏ రంగాలలోనైనా జీవితంలో పురోగమించడం అసాధ్యమేమి కాదన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ, కాలం వృధా చేసుకోవద్దని, ఇలాంటి రంగాలలో స్వయంకృషితో రాణించాలని ఆయన సూచించారు. ఆధునికంగా పెద్ద యెత్తున పరిశ్రమగా రూపొందుతున్న విషయాన్ని గమనించాల్సి ఉందన్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతీ, యువకులు నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి ఈ రంగాలను ఎంచుకొని, నిపుణత సాధించి జీవితాలను సుస్థిరం చేసుకోవాలని కోరారు. సోమవారం నాడు స్థానిక హబ్సిగూడ వీధి నెంబర్ (4) లో ఆడిటోరియం లో ప్రముఖ మోడలింగ్, కాస్ట్యూమ్స్, మేకప్ ఈవెంట్స్ ప్రతినిధి మోక్ష్ ఆధ్వర్యంలో అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. SBMS హైదరాబాద్ చాప్టర్ కార్యాలయంను ఈ సందర్భంగా డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో విశిష్ట అతిధులుగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి, మిస్సెస్ ఆసియా ఫసిపిక్ సుధా జైన్, భారత బాడ్మింటన్ క్రీడాకారిణి మర్రి నవ్యా రావు, వ్యక్తిగత వికాస నిపుణురాలు ప్రొ. సి.హెచ్. రేఖా రావు, బ్యూటీషియన్ ప్రీతి రాజ్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలోలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లకు చెందిన ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తలకు SIBA అవార్డులను అందజేశారు. కన్నుల పండుగగా ఈ కార్యక్రమం నిర్వహింపబడింది.

Leave A Reply

Your email address will not be published.