బాన్సువాడలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  బాన్సువాడ మండలకేంద్రం లోని ప్రభుత్వం ఏరియా ఆసుపత్రిలో నెహ్రు యూవ కేంద్రం మరియు జిల్లా AIDS కంట్రోల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ నర్శింగ్ కళాశాల వారి సహకారంతో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ను ర్యాలీ ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పురుషోత్తం, శ్రీలత,సంతోష్ రెడ్డి, మరియు నర్శింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ రాథోడ్ పాల్గొని ముందుగా విద్యార్థులతో అందరూ కలిసి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా నిర్వహించి సునీల్ రాథోడ్ మాట్లాడుతూ మన జిల్లాలో దాదాపుగా 3000 మంది వరకు ఎయిడ్స్ బాధితులు ఉన్నారు . ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వారు నేటి పరిస్థితి లో ఎలా చూడాలి అంటే ఒక మధుమేహం, హై బి.పి ఉన్నవారు ఎలాగైతే రోజు మందులు వాడాలో అంతే విదంగా ఎయిడ్స్ కు కూడా అంతే వాడాలి, అలైంగిక సృగరాన్ని తగ్గించినప్పుడే ఎయిడ్స్ ను అంతం అందిస్తాము అన్నారు.

Leave A Reply

Your email address will not be published.