ఘనంగా ప్రపంచ మృతిక దినోత్సవం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/కంగ్టి ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా కంగ్జి మండల పరిదిలోని తడ్కల్ పరిసర గ్రామాల రైతువేదికలలో ప్రపంచ మృతిక దినోత్సవం కార్యక్రమం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఏ ఓ ప్రవీణ్ చారి, మాట్లాడుతూ నేల సారవంతంగా ఉంచాలని అన్నారు. నేల సారవంతంగా ఉంచడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అధిక రసాయన ఎరువులు వాడడం వల్ల నేల సారవంతం తగ్గిపోయి పైరు పంటలపై వివిధ రకాల తెగుళ్లు రోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అందుకే తగిన మోతాదులు రసాయన ఎరువులు వాడాలని రైతులను సూచించారు. పంట మార్పిడి చేయడం వల్ల రైతులకు పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ( పి ఎస్ బి ) బసవరాన్ని కరిగించి బ్యాక్టీరియా ( కే ఎస్ బి ) పొటాషియాన్ని కరిగించే బ్యాక్టీరియా ( రైజో బియ్యం )ఈ మూడు రకాల మందులు ప్యాకెట్లు కచ్చితంగా రైతులు వాడాలని దిశ నిర్దేశం చేశారు. పైన తెలిపిన మూడు రకాల మందులు మండలంలోని ప్రతి ఏ ఈ ఓ దగ్గర అందుబాటులో ఉంటాయని తెలిపారు. పి ఎస్ బి, కే ఎస్ బి, రైజోబియం, మండలంలోని ఆయా గ్రామాల క్లస్టర్ ఏఈఓ దగ్గర అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇవి వాడడం వల్ల రైతులకు మేలు చేకూరుతుందని సూచించారు. పోషక విలువలు పెంచి నేలను సారవంతం చేసి మొక్కను కావలసినంత శక్తి సామర్థ్యాలను అందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు కోఆర్డినేటర్ కోట ఆంజనేయులు, గ్రామ రైతు కోఆర్డినేటర్ దర్జీ రమేష్, సొసైటీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి, ఎంపీటీసీ పొగాకుల శ్రీకాంత్, విట్టల్,మురళి,పండరి,రామప్ప, శివ,సునీల్, చెందర్, అప్రోజ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.