హైదరాబాద్ వేదికగా ప్రపంచ వరి సదస్సు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: హైదరాబాద్‌ వేదిగా ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు ప్రపంచ వరి సదస్సు జరగనుంది. అంతర్జాతీయ కమాడిటీస్‌ సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో ఈ సదస్సు కోసం ఏర్పాట్లు చేశారు.

ప్రపంచ వరి సదస్సు నిర్వహణ బాధ్యతను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి చూస్తున్నారు. ఇలాంటి ఓ కార్యక్రమానికి హైదరాబాద్‌ వేదికగా ఉండటం ఆనందంగా ఉందన్నారు తుమ్మల నాగేశ్వరరావు. అంతర్జాతీయ సదస్సుకు అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు, ఎగుమతుదారులు వచ్చి సాంకేతికంగా వస్తున్న ఆధునిక పద్దతులు, ఎగుమతి కోసం తీసుకోవాల్సిన అంశాలు పరిశీలించాలన్నారు.

భారత్‌లో పండే వరి ధాన్యం ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా దేశాల్లో ప్రజలకు అందుతోందని… ఇది ప్రపంచంలోనే 45 శాతంగా ఉందన్నారు తుమ్మల నాగేశ్వరరావు. దీన్ని మరింతగా పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలు ఈ సదస్సు చర్చిస్తామన్నారు.

తొలి రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

Leave A Reply

Your email address will not be published.