భారత్ విజయంతో యువకుల సంబరాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ కామారెడ్డి : ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా యువకులు సంబరాలు జరుపుకున్నారు. ఆదివారం మెల్బోర్న్ వేదికగా టీమిండియా సూపర్ 12లో పాకిస్తాన్తో తన తొలి మ్యాచ్ ను ఆడింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉన్న దశలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 82, హార్దిక్ పాండ్యా 40 పరుగులు సాధించి వరల్డ్ కప్ లో భారత్ గెలుపును సునాయాసం చేశారు. చివర్లో హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ అవుట్ అయిన విరాట్ కోహ్లీ గెలుపును అందించారు. వరల్డ్ కప్ లో భారత్ ఘనవిజయం సాధించడంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా యువకులు బైక్ ర్యాలీలు నిర్వహించడంతోపాటు పలు కూడలలో భానసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.