సమసమాజ నిర్మాణానికి యువతే ముందుండాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత దేశ సమసమాజ నిర్మాణానికి యువత ముందుండి నడపాలని తెలంగాణ ప్రాంత కార్యకారిణి సభ్యులు శ్రీ రాంపల్లి మల్లి కార్జున్ రావు అన్నారు. శుక్రవారం జీఆర్ ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన యువ సమ్మేళనం లో ఆయన ముఖ్య వక్తి గా పాల్గొని యువతనుద్దేశించి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న నైజం విముక్త స్వాతంత్ర అమృతోత్సవ సమితి ఆధ్వర్యంలో బాన్స్ వాడలో నిర్వహించిన ఆజాదిక అమృతమహొత్సవాల సందర్బంగా యువతలో చైతన్యపూరిత భావజాలాన్ని పెంపొందించి యువత దేశం కోసం తన మన ధన పూర్వకంగా సమర్పణ భావంతో యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంత విమోచన కోసంభారత హోమ్ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన సహకారం వల్ల భారత స్వతంత్ర పొందినప్పటికి హైదరాబాద్ సంస్థానం విముక్తి కాలేదు ఏడవ నవాబు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మెడలువంచి తెలంగాణ ప్రజల దాస్యసృంఖలాల నుండి విమోచన కలిగించాడని, తెలంగాణ ప్రజలకు 17సెప్టెంబర్ 1948లో హైదరాబాద్ సంస్ధనం నిజాం నుండి తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం లభించిందన్నారు.తెలంగాణ సంస్థాన ప్రజలకు నిజమైన అమృతోత్సవాలు జరుపుకోవాలని సెప్టెంబర్ 17 2022నుండి సెప్టెంబర్ 17, 2023 వరకు ఈ ఆజాదికా అమృతమహోత్సవాలను నిర్వహించుకోవాలన్నారు.ప్రస్తుత రజాకార్ల పాలన నుండి విముక్తి పొందాలంటే యువత ప్రజాస్వామ్యం విలువలను కాపాడుతూ దేశ హితం కోరే ప్రభుత్వాలను ఎన్నుకోవడం భారత దేశ యువత చైతన్య వంతులుగా తన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకొని ప్రజలకు సుపరి పాలన అందించే ప్రభుత్వాలను ఎన్నుకోవాలని ఆయన యువతకు సూచించారు.అలాగే భారత దేశంలో అరాచక శక్తులను నిరంతరం పసిగడుతూ సమసమాజ నిర్మాణం కోసం పాటు పడాలన్నారు. కళాశాల విద్యార్తిని, విద్యార్థులు భవిష్యత్ తరాలకు ఆదర్శనంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు.కార్యక్రమంలో స్వతంత్ర భారత దేశ పోరాటం తెలంగాణ విమోచన పోరాటం చేసిన వీడియో ప్రదర్శన విద్యా ర్థులను ఎంతో అక్కట్టుకొంది. అనంతరం కొందరు ప్రముఖులు మాట్లాడారు. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు పాలేటి వెంకట్ రావు,జిల్లా అధ్యక్షులు అబ్బ గోని ప్రతాప్,విభాగ్ ప్రచారక్ నరేష్, సూరంపల్లి మొగులయ్య, బెజుగం సత్య నారాయణ, బూనేకర్ సంతోష్,పుర ప్రముఖులు కార్యకర్తలు,విద్యార్థిని విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.