గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డ జొమాటో డెలివరీ బాయ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్:  హైదరాబాద్ గంజాయి సరఫరా విచ్చల విడిగా సాగుతోంది. అయితే, తాజాగా నగరంలో గుట్టుగా గంజాయి రవాణా చేస్తున్న ఓ జొమాటో డెలివరీ బాయ్ ను తుకారంగేట్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిసిపి చందనా దీప్తి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మల్కాజిగిరి మధురానగర్ కు చెందిన చుంచు నితీష్ చంద్ర (20) జోమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. సాంకేతిక కారణాలతో తన ఐడి కార్డు బ్లాక్ అవడంతో, తోటి ఉద్యోగి గుర్తింపు వివరాలతో ప్రస్తుతం డెలివరీలు చేస్తున్నాడు. అయితే నితీష్ తన జొమాటో డెలివరీ బ్యాగులో గంజాయిని దాచి గుట్టుగా సరాఫరా చేస్తుంటాడు. ఇందులో భాగంగా తుకారంగేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని రియో పింట్ హోటల్ వద్ద ఓ వ్యక్తికి గంజాయి డెలివరీ ఇచ్చేందుకు వచ్చి బుధవారం పోలీసులకు దొరికాడు.

Leave A Reply

Your email address will not be published.