వామ్మో..ఇంత పోటీనా

ఒక్క పోస్టు కోసం 10,386 మంది పోటీ దేశంలో నిరుద్యోగ సమస్యను తెలియజేసే ఘటన హిమాచల్ ప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇటీవల హమీర్పూర్ యూనివర్సిటీలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికోసం డిగ్రీ, కంప్యూటర్ డిప్లొమా విద్యార్హతలు ఉన్న 22,140 మంది దరఖాస్తు చేశారు. వారిలో ఫీజు చెల్లించిన 10,386 మందికి అధికారులు హాల్ టికెట్లు జారీ చేశారు. ఈనెల 9న నిర్వహించే పరీక్ష కోసం 43 కేంద్రాలను ఏర్పాటుచేశారు.

Leave A Reply

Your email address will not be published.